close
Array ( ) 1

తాజా వార్తలు

నాగార్జున బాటలోనే సమంత..!

ముంబయి: చైతూతో పెళ్లైన తర్వాత సమంత సినిమాల జోరు పెంచింది. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు ఎక్కువగా చేస్తున్న సమంత వరుస విజయాలతో దూసుకెళుతోంది. కేవలం సినిమాలతోనే కాదు.. ఆమె అభిమానులను అలరించేందుకు వెబ్‌ సిరీస్‌లోకీ అడుగుపెట్టింది. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి ఓ రియాలిటీ షోకు హోస్ట్‌గా కూడా చేయనున్నట్లు సమాచారం.
ఇటీవల సమంత హీరోయిన్‌గా వచ్చిన చిత్రం ‘జానూ’ కలెక్షన్ల పరంగా అంతపెద్ద విజయం సాధించకపోయినా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా వెంటనే తన తర్వాతి సినిమాలకు ఓకే చెప్పేసింది సమంత. విఘ్నేష్‌ దర్శకత్వంలో ‘కథువక్కుల రెండు కాదల్‌’ అనే చిత్రంలో విజయ్‌ సేతుపతి, నయనతారతో కలిసి సమంత కనిపించనుంది. అంతేకాదు.. అశ్విన్‌ శరవరణ్‌ దర్శకత్వంలో వస్తున్న ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలోనూ ఆమె నటిస్తున్నట్లు సమాచారం. సినిమాల విషయం పక్కనపెడితే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’తో ఆమె తొలిసారిగా వెబ్‌సిరీస్‌లోకి అడుగుపెట్టనుంది. ఆ వెబ్‌ సిరీస్‌ ముగిసిన వెంటనే ఓ రియాలిటీ షోలో కనిపించనుంది. అయితే, రియాలిటీ షోకు హోస్ట్‌గా చేస్తుండటంపై సమంత ఎలాంటి ప్రకటన చేయలేదు. సామ్‌ చేయనున్న ఈ షో మీలో ఎవరు కోటీశ్వరుడును పోలి ఉంటుందని తెలుస్తోంది. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు రియాలిటీ షోకు నాగార్జున హోస్ట్‌గా పని చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమంత సైతం అదే బాటలో పయనిస్తోంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.