కమల్‌హాసన్‌కు కుమార్తెల ట్వీట్లు - Shruti Haasan has the sweetest birthday wish for Kamal Haasan
close
Updated : 07/11/2020 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమల్‌హాసన్‌కు కుమార్తెల ట్వీట్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌హాసన్‌ పుట్టినరోజు సందర్భంగా కుమార్తె శృతిహాసన్‌ ట్విటర్‌ వేదికగా తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రితో ఉన్న చిన్ననాటి ఫొటోను జతచేశారు. ‘హ్యాపీ బర్త్‌డే టు బాపూజీ, అప్పా, డాడీ డియరెస్ట్‌ కమల్‌హాసన్‌. ఈ సంవత్సరం మీకు మధురానుభూతులను మిగల్చాలని కోరుకుంటున్నా’ అని అందులో పేర్కొన్నారు. ‘నా స్నేహితుడికి, నా అద్భుతమైన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాతో పాటు లక్షలాదిమందికి ఈరోజు పండుగరోజు.. నా బాపూజీ' అంటూ మరో కుమార్తె అక్షర హాసన్‌ ట్వీట్‌ చేశారు.

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ఈ రోజు 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కారణంగా మధ్యలోనే ఆగిన కమల్‌హాసన్‌ నటించిన ‘భారతీయుడు2’ చిత్రీకరణ మరికొన్ని రోజుల్లో పునఃప్రారంభం కానుంది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వల్‌గా వస్తోంది.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని