రియా చక్రవర్తికి ఎన్‌సీబీ సమన్లు - Sushant Singh Rajput case Rhea Chakraborty served summons by NCB
close
Published : 06/09/2020 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రియా చక్రవర్తికి ఎన్‌సీబీ సమన్లు

మధ్యతరగతి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారన్న నటి తండ్రి

ముంబయి: సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో నటి రియా చక్రవర్తి కుటుంబానికి ఉచ్చు బిగుస్తోంది. మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూర్‌ (ఎన్‌సీబీ) ఆమెకు సమన్లు జారీ చేసింది. ఆదివారం ఏజెన్సీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ముంబయిలోని నటి ఇంటికి అధికారులు సమన్లు పంపించారు. రియా సోదరుడు షోవిక్‌ను అరెస్టు చేసిన రెండు రోజుల అనంతరం ఆమెకు నోటీసులు పంపారు. సుశాంత్ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాతోపాటు షోవిక్‌ చక్రవర్తి సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు ఎన్‌సీబీ కస్టడీలోనే ఉండేలా శనివారం కోర్టు తీర్పు వెల్లడించింది. విచారణలో భాగంగా షోవిక్‌ డ్రగ్స్‌తో సంబంధమున్న పలువురి పేర్లు వెల్లడించినట్లు ఎన్‌సీబీ అధికారులు పేర్కొన్నారు.

షోవిక్‌ అరెస్టును అతడి లాయర్‌ సతీష్‌ మనేషిండే ఖండించారు. అతడు మాదకద్రవ్యాలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ‌ అరెస్టుపై అతడి తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి సైతం స్పందించారు. శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భారత్‌కు శుభాకాంక్షలు. ఇప్పుడు నా కుమారుడిని అరెస్టు చేశారు. తరువాత నా కుమార్తెను అరెస్టు చేయనున్నారు. అనంతరం ఎవరిని అదుపులోకి తీసుకుంటారో తెలియదు. ఓ మధ్యతరగతి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.  

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ జూన్‌ 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నటి రియా చక్రవర్తి సుశాంత్‌ను మనోవేదనకు గురిచేసిందని, ఆమెతోపాటు మరికొందరు అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని నటుడి తండ్రి బిహార్‌లో కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. రియా చక్రవర్తి, ఆమె తండ్రి, ఆమె సోదరుడిని సీబీఐ విచారించింది. ఈ విచారణలో భాగంగానే మాదకద్రవ్యాల గుట్టు బయటపడింది.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని