ఆ పాత్రతో ప్రేమలో పడ్డా - Telugu News Rashmika Said Thar She Loved Her Role In Mission Majnu
close
Updated : 10/09/2021 07:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ పాత్రతో ప్రేమలో పడ్డా

రష్మిక దక్షిణాదిలో దూసుకుపోతున్న నాయికల్లో ఒకరు. ఆమె నటించిన చిత్రాలు అనువాద రూపంలో ఉత్తరాది ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. దీంతో ఆమెకు బాలీవుడ్‌ నుంచి అవకాశం దక్కింది. సిద్ధార్థ్‌ మల్హోత్రతో ‘మిషన్‌ మజ్ను’, అమితాబ్‌బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో తన తొలి చిత్రాల గురించి రష్మిక మనసు విప్పింది. ‘‘మిషన్‌ మజ్ను’ అనేది నా బాలీవుడ్‌ పరిచయానికి చక్కగా కుదిరిన సినిమా. 1970ల నాటి కథతో తెరకెక్కుతోంది. పాకిస్తాన్‌, భారత్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో నా పాత్ర చాలా బాగా నచ్చింది’’అని చెప్పింది. గుడ్‌బై చిత్రం గురించి మాట్లాడుతూ ‘‘150 పేజీలున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ గంటన్నర చదివాకా కచ్చితంగా చేయాల్సిన సినిమా అనిపించింది. అందులోని పాత్రపై ప్రేమలో పడిపోయాను. అమితాబ్‌సార్‌తో కలిసి నటించడం గురించి మా అమ్మానాన్న అయితే చాలా ఆనందంగానే కాదు.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’’అని చెప్పింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని