ఒకటి దసరాకి... మరొకటి దీపావళికి! - Telugu News Release Dates of New Movies Announced
close
Updated : 26/09/2021 07:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకటి దసరాకి... మరొకటి దీపావళికి!

ప్రేక్షకులు మళ్లీ థియేటర్‌ బాట పడుతున్నారు. మంచి కథతో వస్తే వసూళ్లకి ఢోకా లేదనే సంగతి రుజువవుతోంది. తాజాగా విడుదలైన ‘లవ్‌స్టోరి’ సాధించిన విజయమే అందుకు తార్కాణం. ఈ ఉత్సాహంలోనే కొత్త సినిమాలు బాక్సాఫీసు ముందుకు వరుస కట్టనున్నాయి. తాజాగా మూడు సినిమాలు విడుదల తేదీని ప్రకటించాయి.


గాంధీ జయంతికి ‘ఇదే మా కథ’

హదారిపై ప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రం ‘ఇదే మా కథ’. సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. గురుపవన్‌ దర్శకత్వం వహించారు. మహేష్‌ గొల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణని పూర్తి చేసుకున్న ఈ సినిమాని గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించారు. నలుగురు బైక్‌ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమై ఎలాంటి విషయాలు తెలుసుకున్నారనే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం తెరకెక్కిందన్నాయి సినీ వర్గాలు.  


అక్టోబరు 15న ‘వరుడు కావలెను’

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీసౌజన్య దర్శకురాలిగా పరిచయం అయ్యారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విజయదశమిని పురస్కరించుకుని అక్టోబరు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు శనివారం అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.


నవంబర్‌ 4న ‘రొమాంటిక్‌’

ర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. కేతిక శర్మ నాయిక. అనిల్‌ పాదూరి దర్శకత్వం వహించగా...ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్‌ నిర్మించారు. ఆయనే కథ, కథనం, సంభాషణలు సమకూర్చారు. ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబర్‌ 4న విడుదల చేయాలని నిర్ణయించారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించారు.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని