ఈ కథానాయకులకు హీరోయిన్లు కావాలి..! - Tollywood heros searching for their heroins
close
Published : 02/09/2020 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ కథానాయకులకు హీరోయిన్లు కావాలి..!

ఇంటర్నెట్‌డెస్క్‌:  ‘మా అబ్బాయికి తగిన వధువు కావాలి’ అంటూ ప్రకటనలు చూస్తాం. ఇప్పుడు అబ్బాయిల పెళ్లి కోసం తల్లిదండ్రులు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అదే చిత్ర పరిశ్రమ అయితే.. మన కథానాయకులకు తగిన నాయికను వెతకడం దర్శక-నిర్మాతలకు ఒక పరీక్షలా మారింది. ఒక్కోసారి అన్నీ కుదిరినా, చివరి నిమిషంలో ‘సృజన్మాతక వైరుధ్యాల’ కారణంగా తప్పుకొంటారు. యువ కథానాయకులకు జోడీగా నటించడానికి ఏ కథానాయిక అయినా సై అంటే సైఅంటుంది. అగ్ర కథానాయకులకు జోడీలను ఎంపిక చేయడమే ఇప్పుడు పెద్ద సమస్య.

వారి సరసన నటించేది ఎవరు?

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. తొలుత త్రిష కథానాయిక అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకొన్నారు. ఇప్పుడు కాజల్‌ వచ్చారు.  ఈ సినిమా పూర్తయిన వెంటనే చిరు ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించే అవకాశాలు ఎక్కువ. మాతృకలో కథానాయిక పాత్ర లేదు. మరి తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథ మారిస్తే, హీరోయిన్‌ ఉంటుందా? ఉంటే ఎవరిని పెడతారు? ఇలా ఆయన తర్వాత నటించే ప్రతి చిత్రంలోనూ కథానాయిక వెతికి పట్టుకోవడం దర్శక-నిర్మాతలకు పెద్ద పనే. చిరంజీవిలాంటి స్టార్‌డమ్‌ ఉన్న హీరోకు ఆ స్థాయి నాయిక అయితేనే సరిపోతారు.

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. కొంతమేర షూటింగ్‌ పూర్తి చేసుకున్నా, ఇప్పటివరకూ కథానాయిక ఎవరన్న విషయం తెలియదు. పలు పేర్లు వినిపించినా, తానే స్వయంగా చెబుతానని బోయపాటి అన్నారు.

పవన్‌ వరుస సినిమాలు.. మరి హీరోయిన్లు?

ఇటీవల వరకూ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నారు. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్‌సాబ్‌’ మోషన్‌పోస్టర్‌తో పాటు, క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ నటిస్తున్న 27వ చిత్రంలో ప్రీలుక్‌ను విడుదల చేశారు. ఈ రెండు చిత్రాల్లో కథానాయిక ఎవరన్నది ఇంకా తెలియదు. పలు పేర్లు వినిపించినా, చిత్ర బృందం మాత్రం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. వీటి తర్వాత హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌మరో సినిమాలో నటించనున్నారు. ఇందులోనూ కథానాయికగా ఎవరు నటిస్తారన్న విషయం ఇప్పటివరకూ తెలియదు. ఓ మలయాళ కథానాయిక పేరు వినిపించినా, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తానే స్వయంగా వెల్లడిస్తానని అన్నారు. వీరే కాదు, నాగార్జున ‘బంగర్రాజు’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌కు జోడీ, ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కొత్త మూవీ ఇలా పలువురు కథానాయకులకు హీరోయిన్లను వెతికే పనిలో పడ్డారు ఆయా చిత్రాల దర్శక-నిర్మాతలు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని