Cinema News: అల‌రిస్తోన్న‌ ‘పీన‌ట్ డైమండ్’ ట్రైల‌ర్‌ - abhinav sardhar patel starrer peanut diamond trailer released by director krish
close
Published : 14/06/2021 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: అల‌రిస్తోన్న‌ ‘పీన‌ట్ డైమండ్’ ట్రైల‌ర్‌

ఇంట‌ర్నెట్ డెస్క్‌: అభిన‌వ్ స‌ర్దార్ ప‌టేల్‌, రామ్ కార్తీక్‌, చాందిని, షెర్రీ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘పీన‌ట్ డైమండ్’. త్రిప‌ర్న వెంక‌టేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌ర్శ‌కుడు క్రిష్ సోమ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. ‘త్రేతాయుగంలో మంచి చెడు అనేది రామ రావ‌ణ రూపంలో ఒకే ప్ర‌పంచంలో ఉంది. ద్వార‌పయుగంలో కౌర‌వులు, పాండ‌వుల రూపంలో ఒకే కుటుంబంలో ఉంది. కానీ, ఈ క‌లియుగంలో’ అనే డైలాగ్‌తో ప్రారంభ‌మ‌య్యే ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటోంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌తోపాటు రొమాంటిక్ సీన్ల‌తో ఆస‌క్తిగా సాగింది. ప్ర‌ముఖ న‌టులు సుమ‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్ పాత్ర‌లు కీల‌కంగా నిలిచాయి. ‘వ‌జ్రాన్ని త‌యారు చేయాల‌నే ఆలోచ‌న వాడికి ఆరోజే మొద‌లైంది’ అనే సంభాష‌ణ‌తో ట్రైల‌ర్ ముగుస్తుంది. మ‌రి ఆ వ‌జ్రం త‌యారుచేయాల‌నుకుంది ఎవ‌రు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అభిన‌వ్ స‌ర్దార్‌, త్రిప‌ర్న వెంక‌టేశ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని