Koratala Siva: సోషల్‌ మీడియాకి స్వస్తి - acharya director koratala siva away from social media
close
Published : 26/06/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Koratala Siva: సోషల్‌ మీడియాకి స్వస్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను సోషల్‌ మీడియాకి దూరమవుతున్నట్టు ప్రకటించారు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. చివరిగా తన మనసులోని మాటని ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘ఇప్పటి వరకు ఎన్నో విషయాల్ని సామాజిక మాధ్యమాల వేదికగా మీతో పంచుకున్నాను. వాటి నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైంది. మన మీడియా మిత్రుల ద్వారా మీతో ఎప్పుడూ టచ్‌లో ఉంటాను. మాధ్యమం మారుతుంది కానీ మన అనుబంధం కాదు’ అని పేర్కొన్నారు. తన సినిమాలకి సంబంధించిన విషయాల్నే కాకుండా సామాజిక అంశాలపైనా ట్విటర్‌లో చర్చించేవారు కొరటాల. ప్రస్తుతం ఆయన చిరంజీవి కథానాయకుడిగా ‘ఆచార్య’ తెరకెక్కిస్తున్నారు. కాజల్‌ నాయిక. రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇది పూర్తయ్యాక ఎన్టీఆర్‌తో ఓ చిత్రం చేయనున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని