‘‘కరోనా చికిత్సల కోసం రూ. 350 కోట్లు ఖర్చవుతోంది’’ - alla nani condemed alligations on corona treatment
close
Published : 28/07/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘కరోనా చికిత్సల కోసం రూ. 350 కోట్లు ఖర్చవుతోంది’’

ఏపీ మంత్రి ఆళ్ల నాని

అమరావతి: కరోనా కేంద్రాల్లో భోజనం, పారిశుద్ధ్యంపై ఆరోపణలు చేస్తున్నారని.. అలాంటి ఆరోపణలు వైద్యుల మనోధైర్యం దెబ్బతేసే చర్యలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్రంలో కరోనా చికిత్సలపై వస్తున్న ఆరోపణలు, ప్రస్తుత పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా చికిత్సల కోసం రూ. 350 కోట్లు ఖర్చవుతోందన్నారు. కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనాతో మృతి చెందిన వారి దహన సంస్కారాలను ఎవరూ అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చికిత్సకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచామని, గత 6 నెలలుగా 17వేల మంది నిపుణులను నియమించామని మంత్రి నాని పేర్కొన్నారు. కరోనా పరీక్షల కోసం 20 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సకు నిరాకరించినా, అధిక ధరలు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని