Anabelle: తొలిచూపులోనే పడిపోయిన సేతుపతి - annabel sethupathi sneak peek video
close
Published : 09/09/2021 23:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anabelle: తొలిచూపులోనే పడిపోయిన సేతుపతి

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ సేతుపతి, తాప్సీ కలిసి నటించిన  హారర్‌ కామెడీ ‘అనబెల్‌ సేతుపతి’. తెలుగు, తమిళంతో పాటు మొత్తం 5 భాషల్లో తెరకెక్కింది. ఈ నెల 17న డిస్నీ+హాట్‌స్టార్‌లో నేరుగా ప్రసారం కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రచారంలో జోరు పెంచింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.  తాజాగా ప్రేక్షకుల కోసం ‘అనబెల్‌ సేతుపతి’ చిత్రబృందం మరో వీడియోను విడుదల చేసింది. సేతుపతి, తాప్సీ, యోగిబాబులున్న ఈ సన్నివేశం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆ సీన్‌ను మరింత అందంగా మార్చేసింది.  రాజుగా నటించిన విజయ్‌ సేతుపతి తన ప్రేయసిని తొలిసారి కలుసుకొనే సన్నివేశమది. రోడ్డు మీద ఆగిపోయిన తన కారును, తాప్సీ రిపేర్‌ చేస్తుండగా మొదటిసారి చూస్తాడు. తన పనితీరు, అందం, ఇంగ్లీష్‌లో ముద్దుముద్డుగా మాట్లాడే విధానం నచ్చి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. అలా తాప్సీపై మనసు పారేసుకున్న సేతుపతి తరువాత ఏం చేశాడనేది తెలుసుకోవాలంటే ఈ నెల 17 దాకా వేచి చూడాల్సిందే.  రాజమహల్‌ చుట్టూ తిరిగే హారర్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, రాజేంద్ర ప్రసాద్‌, జగతిబాబు, సురేఖవాణిలు కీలకపాత్రల్లో నటించారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని