ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్? - balayya movie title announcement on ugadi
close
Published : 10/04/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘బీబీ3’ వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పేరును ఉగాది రోజున ప్రకటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. ఇప్పటికే సినిమాకి సంబంధించిన టైటిల్‌పై సామాజిక మాధ్యమాల్లో రెండు మూడు పేర్లు బయటకు వచ్చాయి. వాటిలో ఒకదానిని ఖరారు చేస్తారా? లేదా వేరే టైటిల్స్ పెడతారా? అనే విషయం తెలియాలంటే ఉగాది వరకు వేచి చూడాల్సిందే. ఇందులో పూర్ణ  వైద్యురాలి పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. చిత్రాన్ని మే 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని