హాలిడే మూడ్‌లో బ్యూటీలు.. చీరలో వర్కౌట్‌ - celebrities social media round up
close
Published : 28/11/2020 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హాలిడే మూడ్‌లో బ్యూటీలు.. చీరలో వర్కౌట్‌

సోషల్‌ లుక్‌: సెలబ్రీలు పంచుకున్న విశేషాలు

సినీ తారలంతా పూర్తిగా హాలిడే మూడ్‌లో ఉన్నారు. త్వరలోనే షూటింగ్‌లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మాల్దీవులు, దుబాయ్‌.. ఇలా నచ్చిన ప్రదేశాలకు వెళ్లి రీఫ్రెష్‌ అవుతున్నారు. ప్రత్యేకించి నటీమణులు ప్రకృతి అందాల మధ్య తీసుకున్న ఫొటోలతో అభిమానుల్ని ఫిదా చేస్తున్నారు. సమంత, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, మెహరీన్‌, సోనాక్షి సిన్హా తదితరులు ట్రిప్‌లను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇలా పలువురు సెలబ్రిటీలు షేర్‌ చేసిన తాజా విశేషాలు మీరే చూడండి..

* ‘అంధకారం’ సినిమాకు విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ ప్రశంసలు దక్కాయి. ‘మీ మాటలతో మాలో నిత్యం పోత్సాహం నింపుతున్నందుకు ధన్యవాదాలు కమల్‌ సర్‌’ అని అట్లీ పోస్ట్‌ చేశారు.

* నటి మంచు లక్ష్మి కొత్త ఆఫీసులో అడుగుపెట్టారు. శుక్రవారం తన కుమార్తెతో కలిసి కార్యాలయం ప్రారంభించినట్లు లక్ష్మి తెలిపారు. చాలా ఉత్సుకతగా, బిడియంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.

* కథానాయకుడు నితిన్‌ తన సతీమణి షాలినితో కలిసి దుబాయ్‌ వెళ్లారు. అక్కడ తీసుకున్న ఫొటోల్ని పంచుకున్నారు. మరోపక్క ‘రంగ్‌దే’ చిత్రం షూటింగ్‌ కోసం దుబాయ్‌ బయలుదేరామని శేఖర్‌ మాస్టర్‌ పోస్ట్‌ చేశారు.

* తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో తీసుకున్న సెల్ఫీని రాహుల్‌ సిప్లిగంజ్‌ షేర్‌ చేశారు. హైదరాబాద్‌కు సంబంధించిన గీతాన్ని ఆయన విడుదల చేసినట్లు తెలిపారు.

* నటి అనసూయ, అశ్విన్‌ విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘థ్యాంక్‌ యూ బ్రదర్‌!’ పోస్టర్‌ను సాయిధరమ్‌ తేజ్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనసూయ గర్భిణిగా కనిపించారు.

* ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’, ‘బైపాస్‌ రోడ్‌’ తదితర చిత్రాలతో గుర్తింపు పొందిన గుల్‌ పనాగ్‌ చీరలో కసరత్తులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఎక్కడున్నా, ఎలా ఉన్నా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయనంటూ ఆమె సందేశం ఇచ్చారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని