సంక్షేమ పాలనకు ఎన్టీఆర్‌ ఆద్యుడు: చంద్రబాబు  - chandrababu on twitter over ntr
close
Published : 18/01/2021 11:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షేమ పాలనకు ఎన్టీఆర్‌ ఆద్యుడు: చంద్రబాబు 


హైదరాబాద్‌: రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఎన్టీఆర్‌ సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటిన నందమూరి తారకరామారావు దూరమై 25 సంవత్సరాలు గడిచినా.. ఆ విశ్వవిఖ్యాతుడు మన కళ్ల ముందే కదలాడుతున్నట్టు ఉందన్నారు.

బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన గొప్ప నేత ఎన్టీఆర్‌ అని చంద్రబాబు కొనియాడారు. పేదలకు ఆహార, నివాస భద్రత, కట్టుకోవడానికి మంచి వస్త్రం అందించి సంక్షేమ పాలనకు ఆద్యుడయ్యారన్నారు. తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్‌కు అందించే అసలైన నివాళి అని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఎన్టీఆర్‌ ఆశయసాధనకు పునరంకితమవుదాం: లోకేశ్‌
మనిషి ఎదగడానికి కృషి ఉంటే చాలని ఎన్టీఆర్‌ నిరూపించాడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మానవతావాది ఆశయ సాధనకు పునరంకితవుదామని ఆయన ట్వీట్‌ చేశారు.

తెలుగు భాష కీర్తిని ఎన్టీఆర్‌ పెంచారు: బాలకృష్ణ
తెలుగు భాష కీర్తిని ఎన్టీఆర్‌ పెంచారని ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మికంగానే కాకుండా సమాజం కోసం ఎన్టీఆర్‌ పోరాడారని కొనియాడారు. చావుపుట్టుకలతో సంబంధం లేని గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‌ అని.. ప్రపంచంలో ఎవరూ చేయలేని పాత్రలను ఆయన చేశారన్నారు. ఎన్టీఆర్‌ అంటే ఒక ట్రెండ్‌ సెట్టర్ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

ఇదీ చదవండి..
కాషాయం కట్టిన లౌకికవాదిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని