కరోనాను అడ్డుకునే కార్డులంటూ ఘరానా మోసం - cheating with fake id card whish is protect from corona
close
Updated : 26/07/2020 21:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాను అడ్డుకునే కార్డులంటూ ఘరానా మోసం

గుంతకల్లు, న్యూస్‌టుడే: తాము అందించే కార్డును మెడలో ధరిస్తే కరోనా సోకదని ప్రచారం చేస్తూ గుంతకల్లు పట్టణంలోని ఓ మందుల దుకాణం యజమాని పట్టణ ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. ఈ వ్యవహారం గత మూడు రోజుల నుంచి గుంతకల్లులో సాగుతోంది. ఒక్కొక్క కార్డును అతను రూ. 200కు విక్రయిస్తున్నారు. ఈ కార్డును ఎవరైతే ధరిస్తారో కరోనా వారి జోలికి రాదని ఆయన నమ్మబలుకుతూ వాటిని అమ్ముతున్నారు. ఈ విధంగా ఆయన కొన్ని వందల కార్డులను విక్రయించినట్లు తెలిసింది. కార్డులను కంపెనీవారు కరోనా వైరస్‌ దరికి రాకుండా వాటిని తయారు చేశారని ఆయన పట్టణ ప్రజలకు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా నివారణకు మందులను కనుగొనే ప్రయత్నంలో వివిధ కంపెనీలు నిమగ్నమై పోరాడుతుంటే మందుల దుకాణం యజమాని ఈ విధంగా చేయడం మంచిదికాదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంగా మందుల దుకాణం యజమానిని అడుగగా తాను కరోనా నివారణ కార్డులను ఇతరులకు అమ్మలేదని తమ బంధువులు, స్నేహితులకు మాత్రమే ఇచ్చామని అన్నారు. తాము ఫ్లిప్‌కార్డ్‌ అమెజాన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ద్వారా కొనుగోలు చేపి పంచామే కాని తాము స్వయంగా తయారు చేయలేదని వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని