ధన్యవాదాలు ఈషా.. కార్తికేయ: చిరంజీవి - chiranjeevi new videos on corona awareness
close
Published : 16/07/2020 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధన్యవాదాలు ఈషా.. కార్తికేయ: చిరంజీవి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాప్తి మొదలైన తొలి రోజుల్లో దానిపై అవగాహన కోసం ప్రముఖ  నటుడు చిరంజీవి ఓ షార్ట్‌ ఫిల్మ్‌, ఓ పాట రూపొందించారు. ‘ఇంట్లోనే ఉండండి... జాగ్రత్తగా ఉండండి’ అంటూ సందేశమిచ్చారు. ఇప్పుడు చిరంజీవి మరోసారి ఆ తరహా ప్రయత్నం చేశారు. ‘మాస్క్‌ ధరించండి.. కరోనా చైన్‌ను బ్రేక్‌ చేయండి’ అంటూ పిలుపునిచ్చారు. ఈ మంచి ప్రయత్నంలో చిరంజీవికి యువ కథానాయకుడు కార్తికేయ, యువ కథానాయిక ఈషా రెబ్బా తోడుగా నిలిచారు. వీరి సహకారంతో చిరంజీవి రెండు అవగాహన వీడియోలు రూపొందించి ట్వీట్‌ చేశారు. 

ఇదీ వీరుడి లక్షణం...

‘మీసం మెలేయడం వీరత్వం... కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ముఖానికి మాస్కు ధరించడం వీరుడి లక్షణం’ అంటూ కార్తికేయకు చిరంజీవి ఓ వీడియోలో చెప్పారు. ఇంకా ఈ వీడియోలో చిరంజీవి ఏం చెప్పారో మీరే చూడండి.


చిరునవ్వు కలకాలం నిలవాలంటే...

‘చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే... ముఖానికి మాస్కు ధరించడం ఎంతో అవసరం’ అని మరో వీడియోలో ఈషాకు చిరంజీవి చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారో ఈ వీడియోలో చూసేయండి.

మీరూ మాస్కు తప్పనిసరిగా ధరించండి... మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి. ఇది చిరంజీవి మాటే కాదు. ఈ కరోనా కష్టకాలంలో అందరూ పాటించాల్సిన బాట.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని