నాన్న వచ్చి 45ఏళ్లు.. మాల్దీవులకు మరోనటి - cinema celebreties posts on social media
close
Published : 23/11/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్న వచ్చి 45ఏళ్లు.. మాల్దీవులకు మరోనటి

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్‌లు జోరందుకోనున్నాయి. దీంతో హీరోయిన్లు దొరికిన సమయాన్ని వీలైనంత వరకూ ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికే రకుల్‌ప్రీత్‌సింగ్‌, ప్రణీత మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా.. అక్కినేని కోడలు సమంత సైతం మాల్దీవులకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. డైలాగ్‌కింగ్‌ మోహన్‌బాబుకు మనోజ్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఇంకా తారలు ఏమేం విశేషాలు పంచుకున్నారో చూద్దాం పదండి..

* డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి నేటితో 45 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ వీడియో పోస్టు చేశారు.
* హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాల్దీవుల్లో సెలవులను ఆస్వాదిస్తోంది. సముద్రపుటంచుల్లో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది.
* అక్కినేని సమంత కూడా మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె మాల్దీవుల్లో ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
* బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్ కరోనా పరీక్ష చేయించుకుంది. ఆ టెస్టుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో పంచుకుంది. 
* ‘డింగో నా టీషర్టు మీద ఎందుకు ఉన్నావ్‌..?’ అంటూ సినీ హీరో దగ్గుపాటి రానా ఓ పోస్టు చేశారు.
* హీరోయిన్‌ సనాఖాన్‌ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
* ‘రూలర్‌’ హీరోయిన్‌ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్టు చేసింది.

* నటుడు అక్కినేని నాగచైతన్య నవంబర్‌ 23తో 34వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ సందర్భంగా చైతన్య కామన్‌ డీపీని విక్టరీ వెంకటేశ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ వేర్వేరుగా విడుదల చేశారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని