అక్కడ థియేటర్లు తెరిచారోచ్‌... - cinema theatres reopend in china today
close
Updated : 21/07/2020 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్కడ థియేటర్లు తెరిచారోచ్‌...

‘ఏంటీ.. ఇది థియేటర్‌లో తీసిన ఫొటోలా ఉంది. వీళ్లంతా ఎవరు.. ఇంత ధైర్యంగా థియేటర్‌కి వచ్చారు’ అనుకుంటున్నారా? ఆగండాగండి ..  ఆశ్చర్యపోయేముందు ఒక్క మాట. ఈ ఫొటో తీసింది మన దేశంలో కాదు.. చైనాలో. అవును అక్కడి హాంగ్‌జోవ్‌ ప్రాంతంలో క్లిక్‌మనిపించిన ఫొటో ఇది. కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు తాజాగా ఈ రోజు ఓపెన్‌ అయ్యాయి. 

కరోనా ప్రభావం తొలుత కనిపించిన చైనాలో పరిస్థితులు మారుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.  దీంతో చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు నుంచి థియేటర్లు తెరుచుకున్నాయి. షాంఘై, హాంగ్‌జోవ్‌, గుయిలిన్‌ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. 

మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అనే నిబంధనతో ప్రేక్షకులను థియేటర్లకు అనుమతిస్తున్నారు. వచ్చేటప్పుడు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నారు. అలాగే థియేటర్లలో మనిషికి, మనిషికి మధ్య ఓ సీటు ఖాళీ ఉంచుతున్నారు. కొన్ని థియేటర్లలో సీటు ఖాళీగా ఉంచకుండా... మధ్యలో టెడ్డీబేర్‌లు లాంటివి ఉంచుతున్నారు. కొన్ని చోట్లయితే రెండేసి సీట్లు ఖాళీ ఉంచుతున్నారు. అలాగే ప్రతి షో తర్వాత థియేటర్‌ను శానిటైజ్‌ చేస్తున్నారు. 

మన దేశంలోనూ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టాక... ఇలాంటి చర్యలు తీసుకొని థియేటర్లు ఓపెన్‌ చేస్తారేమో చూడాలి. అక్కడి ప్రేక్షకుల్లాగే మన జనాలు జాగ్రత్తలు పాటించకతప్పదు. అలా కాకుండా ఇప్పుడు మార్కెట్ల దగ్గర సాంఘిక దూరం మరచి ఎగబడినట్లు... థియేటర్ల దగ్గర ప్రవర్తిస్తే  పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని