బెన్‌స్టోక్స్‌ ఔటా.. నాటౌటా? - confusion in benstokes runnot and controversy on third umpires decision
close
Published : 27/03/2021 09:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెన్‌స్టోక్స్‌ ఔటా.. నాటౌటా?

థర్డ్‌ అంపైర్‌ దీన్ని ఔటిచ్చి ఉంటే..

పుణె: రెండో వన్డేలో మూడో అంపైర్‌ తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ స్టోక్స్‌ రనౌట్‌ విషయంలో అంపైర్‌ నిర్ణయం చర్చనీయాంశమైంది. భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 26వ ఓవర్‌ అయిదో బంతిని మిడాన్‌ దిశగా పంపిన స్టోక్స్‌.. రెండో పరుగుకు ప్రయత్నించాడు. కుల్‌దీప్‌ త్రో నేరుగా వికెట్లకు తాకింది. అతను కచ్చితంగా ఔటై ఉంటాడని భారత ఆటగాళ్లు అనుకున్నారు. కానీ చాలా సార్లు రిప్లేలో పరీక్షించిన తర్వాత మూడో అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. బ్యాట్‌ క్రీజు గీత దాటి లోపలికి రాలేదని, అది ఔటేనని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సహా ఆటగాళ్లు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అప్పుడు స్టోక్స్‌ స్కోరు 31. ఆ తర్వాత విధ్వంసం సృష్టించిన అతను భారత్‌ నుంచి మ్యాచ్‌ లాగేశాడు. ఒకవేళ స్టోక్స్‌ను అప్పుడే ఔట్‌గా ప్రకటించి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని