కరోనా ‘మహా’ కలవరం: ఒక్కరోజే 17వేలు  - corona virus update in maharastra
close
Updated : 16/03/2021 22:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ‘మహా’ కలవరం: ఒక్కరోజే 17వేలు 

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కొత్త అలజడి సృష్టిస్తోంది. ఒక్కరోజే 17వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. గడిచిన 24గంటల్లో అక్కడ 17,864 కొత్త కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో అత్యధికంగా నమోదైన కేసులు ఇవే కావడం గమనార్హం. ఒక్క ముంబయి నగరంలోనే 1,922 కొత్త కేసులు వచ్చాయి. రాష్ట్రంలో మరణాల రేటు 2.26శాతంగా ఉంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 1,38,813 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు, రాష్ట్రంలో సెకెండ్‌ వేవ్‌ ప్రారంభ దశలో ఉందని, ప్రజల నిర్లక్ష్యం మూలంగానే అక్కడ వైరస్‌ విచ్చలవిడిగా వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది.

గత 10 రోజుల్లో కొత్తగా అత్యధికంగా కరోనా కేసులు నమోదైనట్టు 19 జిల్లాల పేర్లను కేంద్రం వెల్లడించింది. వీటిలో 15 జిల్లాలు మహారాష్ట్రలోనే ఉండగా.. కేవలం నాలుగు జిల్లాలు మాత్రమే బయట రాష్ట్రాల్లో ఉండటం గమనార్హం. గత పది రోజుల్లో పుణె, నాగ్‌పూర్‌, ముంబయిలలో దాదాపు వెయ్యి కేసులు నమోదవుతున్నట్టు కేంద్రం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. పుణెలో గత పది రోజుల్లో 26,218 కేసులు రాగా.. ముంబయిలో 11,859 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు, వారం పాటు లాక్‌డౌన్‌లో ఉన్న నాగ్‌పూర్‌లో గత పది రోజుల్లోనే 20,104 కొత్త కేసులు వచ్చాయి. 

10 రోజుల్లో కేసులు ఇలా..

పుణెలో 26,218, నాగ్‌పూర్‌ 20,104, ముంబయి 11,859, ఠానే 10,914, నాసిక్‌ 9024, ఔరంగాబాద్‌ 6652, జల్‌గావ్‌ 6598, ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌) 5238, బెంగళూరు అర్బన్‌ (కర్ణాటక) 5047, అమరావతి 4250, అహ్మద్‌నగర్‌ 3962, చెన్నై (తమిళనాడు) 3811, ముంబయి సబర్బన్‌ 3355, యావత్మల్‌ 3326, అకోలా 3299, బుల్దానా 3185, నాందేడ్‌ 3146, వర్ధా 2431, జలంధర్‌ (పంజాబ్‌‌) 2434 చొప్పున కేసులు నమోదయ్యాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని