Crime news: దారుణంగా హతమార్చి.. శవాలను రెండు రాష్ట్రాల్లో వదిలేసి - couple kidnapped from delhi murdered in mp bodies dumped in different states
close
Published : 18/09/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime news: దారుణంగా హతమార్చి.. శవాలను రెండు రాష్ట్రాల్లో వదిలేసి

దిల్లీ: తమ ఇంటి ఆడబిడ్డ ప్రేమలోపడి వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని ఆ కుటుంబసభ్యులు క్రూర మృగాల్లా వ్యవహరించారు. ఇద్దరిని అతి దారుణంగా హతమార్చి.. మృతదేహాలను రెండు రాష్ట్రాల్లో వదిలేశారు. తాజాగా రాజస్థాన్‌లో లభించిన బాలిక మృతదేహంపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఫిరోజాబాద్‌ ప్రాంతంలోని జహంగీర్‌పుర్‌లో ఓ యువకుడు నివసించేవాడు. అతడి ఇంటి సమీపంలో ఉండే మైనర్‌ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక ఇంట్లో చెప్పడంతో పెళ్లికి వారు ససేమిరా అన్నారు. దీంతో ప్రేమికులిద్దరూ జులై 31 దిల్లీకి పారిపోయారు. వారు దిల్లీలో ఉన్నారన్న సమాచారంతో బాలిక బంధువులు అక్కడకు చేరుకున్నారు. వారిని జీపులో ఎక్కించుకొని మధ్యప్రదేశ్‌లోని భిండ్‌కు, అక్కడి నుంచి గ్వాలియర్‌కు వెళ్లారు. ఈ దారిలోని యువకుడికి అత్యంత దారుణంగా హతమార్చారు. అతడి మర్మాంగాలను కత్తితో కోసేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అత్రి పోలీసుస్టేషన్‌ పరిధిలో వదిలేసి వెళ్లిపోయారు. ఆగస్టు 5వ తేదీన పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

తాజాగా రాజస్థాన్‌లోని ధోల్‌పురా ప్రాంతంలో ఓ బాలిక శవాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. ఓ తాడుతో ఆమెకు ఉరి బిగించి హత్య చేశారు. అనుమానంతో బాలిక కుటుంబీకుల ఫోన్‌ లొకేషన్లను పరిశీలించిన పోలీసులు వారు దిల్లీ, గ్వాలియర్‌, ధోల్‌పుర్‌ ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలుసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా ఈ జంట హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబీకులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని