నాలుక సమస్యలు కూడా కొవిడ్‌ లక్షణమేనా? - covid tongue a symptom
close
Published : 03/02/2021 20:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుక సమస్యలు కూడా కొవిడ్‌ లక్షణమేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ను ఆదిలోనే గుర్తించేందుకు వాటి లక్షణాలే ఎంతో కీలకమనే విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే నిపుణులు కొన్ని లక్షణాలను పేర్కొన్నప్పటికీ, వైరస్‌ సోకిన రోగుల్లో కొత్త లక్షణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కరోనా సోకిన వారి నోటిలో అల్సర్లు, నాలుక లావెక్కడం వంటి లక్షణాలు కొత్తగా వెలుగులోకి వస్తున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.

కొవిడ్‌ సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి నిపుణులు పేర్కొన్న కొవిడ్‌ లక్షణాలు కాకుండా కొత్తవి కనిపిస్తున్నట్లు లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్‌ టిమ్‌ స్పెక్టార్‌ వెల్లడించారు. కరోనా బారినపడిన వారు స్వయంగా లక్షణాలను వెల్లడించే యాప్‌ను టిమ్‌ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు దేశాల్లో లక్షల మంది ఈ యాప్‌ ద్వారా కొవిడ్‌ లక్షణాలను తెలియజేసినట్లు టిమ్‌ పేర్కొన్నారు. వీటిలో కొందరికి నాలుక అనారోగ్య సమస్యలు కూడా కనిపించినట్లు తెలిపారు. కొవిడ్‌ సోకిన వారి నాలుక తీవ్ర అనారోగ్యానికి గురౌతున్న విషయాన్ని నిపుణులకు సూచించామని.. తొలత వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోనప్పటికీ ప్రస్తుతం వాటిని కూడా కొవిడ్‌ లక్షణంగా అనుమానిస్తున్నారని వెల్లడించారు. ఇలా అనుకోని మార్పులు సంభవించినప్పుడు వాటిని పరిగణలోకి తీసుకొని కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వల్ల వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చని సూచిస్తున్నారు.

సాధారణంగా జ్వరం, దగ్గు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలను కొవిడ్‌ లక్షణాలుగా నిపుణులు సూచిస్తున్నారు. శరీరంపై దద్దుర్లు, తలనొప్పి, డయేరియా వంటి జీర్ణాశయ సమస్యలు కూడా కొవిడ్‌ లక్షణాలుగానే పరిగణిస్తున్నారు. తీవ్ర అలసట, గొంతునొప్పిని కూడా కరోనా లక్షణాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని