Covaxin: పిల్లలపై ప్రయోగాల నిలిపివేతకు కోర్టు నిరాకరణ - delhi high court denies to stay clinical trials of covaxin on children
close
Published : 19/05/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covaxin: పిల్లలపై ప్రయోగాల నిలిపివేతకు కోర్టు నిరాకరణ

దిల్లీ: 2 నుంచి 18 ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ ఇచ్చిన అనుమతిపై స్టే విధించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. అలాగే కేంద్రం, డీసీజీఐకు నోటీసులు జారీ చేసింది. 2-18 ఏళ్ల చిన్నారులపై కొవాగ్జిన్‌ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిస్తూ డీసీజీఐ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై దిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ట్రయల్స్‌లో పాల్గొనాల్సిన పిల్లలు తమకు తాము వాలంటీర్లుగా రిజిస్టర్‌ చేసుకుంటున్నారని కుమార్‌ వ్యాజ్యంలో పేర్కొన్నారు. అయితే, మైనర్లయిన పిల్లలకు టీకా ప్రయోగాల వల్ల తలెత్తే పరిణామాలపై పూర్తి స్థాయి అవగాహన ఉండదని తెలిపారు. అలాగే ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రుల అంగీకారం కూడా ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది చిన్నారుల జీవితానికి సంబంధించిన విషయమని.. దీనికి తల్లిదండ్రుల అనుమతితో ముందుకు వెళ్లలేమని వాదించారు.

కరోనా నియంత్రణకు 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకు సైతం కొవాగ్జిన్‌ టీకా ఇచ్చేలా భారత్‌ బయోటెక్‌ సంస్థ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే డీసీజీఐ నుంచి అనుమతి కూడా పొందింది. మరో 10 నుంచి 12 రోజుల్లో రెండు, మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమవుతాయని నీతి ఆయోగ్‌ సీనియర్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ మంగళవారం వెల్లడించారు. ఈ టీకాను 525 మందిపై పరీక్షించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలే వెల్లడించింది.‘కొవాగ్జిన్‌’ టీకాను ఇప్పటికే 18 ఏళ్లు పైబడినవారికి పంపిణీ చేస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని