9 నెలల తర్వాత దిల్లీలో అతి తక్కువ కేసులు - delhis daily covid cases less than 100 for first time from april
close
Published : 27/01/2021 22:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

9 నెలల తర్వాత దిల్లీలో అతి తక్కువ కేసులు

తొలిసారి 100 లోపు కొవిడ్‌ కేసులు నమోదు

దిల్లీ: దేశ రాజధాని నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 96 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదుకావడం విశేషం. ఏప్రిల్‌ 30 తర్వాత ఒక్కరోజు వ్యవధిలో 100 లోపు పాజిటివ్ కేసులు రావడం ఇదే ప్రథమం. నగరంలో కరోనా పరిస్థితిపై దిల్లీ వైద్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. ఇప్పటిదాకా 1,04,95,046 శాంపిల్స్‌ పరీక్షించగా.. 6,34,325మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 6,21,995మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 10,829మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1501 క్రియాశీల కేసులు ఉన్నాయి. దిల్లీలో పాజిటివిటీ రేటు 6.04శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.71శాతంగా ఉంది. 

గడిచిన 24గంటల్లో వచ్చిన కేసులను పరిశీలిస్తే.. 29,855 మందికి పరీక్షలు నిర్వహించగా.. 96 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఒక్కరోజే 212మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. తొమ్మిది మరణాలు నమోదయ్యాయి.

ఇదీ చదవండి..

భారత్‌ : 97 శాతానికి చేరిన రికవరీ రేటు..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని