‘కేజీఎఫ్‌2’ టీజర్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. - director prashant neel released the still from kgf chapter2
close
Updated : 04/01/2021 19:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కేజీఎఫ్‌2’ టీజర్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌..

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాకీభాయ్‌ సామ్రాజ్యం తలుపులు తెరుచుకునేందుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. జనవరి 8న హీరో యశ్‌ జన్మదినం సందర్భంగా టీజర్‌ విడుదల చేస్తామని దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ఇప్పటికే ప్రకటించారు. అప్పటి నుంచి టీజర్‌ కోసం అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. కాగా.. సినిమాలోని ఓ స్టిల్‌ను అభిమానులతో పంచుకుంటూ.. ‘రాకీభాయ్‌ తన సామ్రాజ్యపు తలుపు తెరవడానికి కౌంట్‌డౌన్‌ ఇప్పుడు మొదలైంది’ అంటూ డైరెక్టర్‌ రాసుకొచ్చారు.

కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ మార్చిలో నిలిచిపోయింది. లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం ఆగస్టులో పునఃప్రారంభమై తాజాగా విడుదలకు సిద్ధమైంది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా వచ్చి భారీ విజయం సాధించిన ‘కేజీఎఫ్‌’కు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. పాన్‌ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ‘అధీర’గా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, రవీనా టాండన్‌ కీలకపాత్రల్లో నటించారు.

ఇదీ చదవండి..

నేను భారతీయుడినే.. ఇదిగో రుజువు: దిల్జిత్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని