నవ్వుతూ ఉండటమే నా సీక్రెట్‌: మోహన్‌లాల్‌  - drishyam2 to be realeased in theatres after ott release
close
Published : 16/02/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవ్వుతూ ఉండటమే నా సీక్రెట్‌: మోహన్‌లాల్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అయితే కేవలం హీరోగా మాత్రమే మనకు తెలిసిన ఆయనలో మనకు తెలియని చాలా కోణాలున్నాయి. ఆయన కేవలం అద్భుతమైన నటుడు మాత్రమే కాదు.. నిర్మాత, దర్శకుడు, గాయకుడు కూడా. మలయాళ చిత్రసీమకు చెందిన ఆయన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘దృశ్యం 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో అలరించనుంది. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌లో అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

ఓటీటీ తర్వాత ‘దృశ్యం2’ థియేటర్‌లోనూ విడుదల చేస్తారా..?

మోహన్‌లాల్‌: అవకాశం ఉంది

మీ తర్వాతి సినిమా 

మోహన్‌లాల్‌: బార్రోజ్‌

మీకు ఇష్టమైన కార్టూన్?

మోహన్‌లాల్‌: బోబనమ్ మోలియం

మీ బలం ఏంటి..?

మోహన్‌లాల్‌: సినిమా

మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి?

మోహన్‌లాల్‌: అన్నీ..

‘దృశ్యం3’ ఉంటుందా..?

మోహన్‌లాల్‌: మొదట మీరు ‘దృశ్యం2’ చూడండి(నవ్వుతూ)

ప్రియదర్శన్‌ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌తో ఒక సినిమా చేయండి ప్లీజ్‌.

మోహన్‌లాల్‌: చూద్దాం..

మీకు ఇష్టమైన జోనర్‌..?

మోహన్‌లాల్‌: హాస్యం.

మీ ఎనర్జీ మంత్రం..?

మోహన్‌లాల్‌: నవ్వుతూ ఉండటం

మరక్కర్ గురించి, ప్రియదర్శన్ దర్శకత్వం గురించి ఒక్కమాటలో.?

మోహన్‌లాల్‌: అద్భుతం.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని