పోలీస్‌గా ఫహాద్‌? - fahad fazil as police officer in kamal haasan vikram movie
close
Published : 24/05/2021 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీస్‌గా ఫహాద్‌?

ఇంటర్నెట్‌డెస్క్‌: కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘విక్రమ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇందులో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో ఆయన పోషించబోయే పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. 

ఫహాద్‌ ఈ చిత్రంలో అవినీతిపరుడైన పోలీసు అధికారిగా కనిపించనున్నారని సమాచారం. జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడానికి సహాయపడే పోలీసుగా ఆయన పాత్ర చిత్రణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని వర్గాల్లో మాత్రం ఆయన ఈ సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని