అమిత్‌ షాకు సవాల్‌ విసిరిన దీదీ! - fight abhishek first then me mamata
close
Published : 19/02/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమిత్‌ షాకు సవాల్‌ విసిరిన దీదీ!

కోల్‌కతా: తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె అల్లుడు అభిషేక్‌ బెనర్జీపై కేంద్ర మంత్రి అమిత్‌ షా చేస్తోన్న విమర్శలను పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిప్పికొట్టారు. ధైర్యముంటే మొదట తన అల్లుడు అభిషేక్‌ బెనర్జీపై ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాతే తనను ఎదుర్కోవాలని అమిత్‌ షాకు సవాల్ విసిరారు. దక్షిణ పరగణాల జిల్లాలోని పైలాన్‌ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో బెంగాల్‌ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రిపై విరుచుకుపడ్డారు.

మమతా బెనర్జీ తర్వాత పార్టీలో అత్యంత ప్రాధాన్యత అభిషేక్ బెనర్జీకే ఉన్న విషయం తెలిసిందే. దీంతో తృణమూల్‌ కూడా కుటుంబ రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ముఖ్యమంత్రి పీఠాన్ని అభిషేక్‌కు అప్పగించే ప్రయత్నం చేస్తోందంటూ భాజపా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో భాజపా చేస్తోన్న విమర్శలను దీదీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ‘ఎంపీ కావాలంటే అభిషేక్‌ నేరుగా రాజ్యసభ ద్వారా వెళ్లవచ్చు. కానీ, నేరుగా ఎన్నికల్లో పాల్గొని ప్రజాతీర్పుతోనే అభిషేక్‌ బెనర్జీ లోక్‌సభలో అడుగుపెట్టారు. అందుకే ముందుగా అభిషేక్‌ బెనర్జీపై గెలిచి, తనపైన విమర్శలు చేయాలి’ అని మమతా బెనర్జీ అమిత్‌ షాకు సవాల్‌ విసిరారు. అంతేకాకుండా మీ కుమారుడు క్రికెట్‌ అసోసియేషన్‌లో ఎలా స్థానం సంపాదించారని అమిత్‌షాను ప్రశ్నించిన దీదీ, వందల కోట్ల రూపాయలను ఎలా సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇక రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తృణమూల్‌ విజయం సాధిస్తుందని, గత ఎన్నికల రికార్డులను తిరగరాస్తామన్నారు.

ఇక, మమతా బెనర్జీ సర్కార్‌ను ఓడించి భాజపాను అధికారంలోకి తేవడం తమ లక్ష్యం కాదని, ఇక్కడి పరిస్థితుల్లో మార్పు తేవడమే లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నవేళ.. రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగాల్‌లో అమిత్‌ షా పర్యటించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కాక్‌ద్విప్‌ ప్రాంతంలో పరివర్తన్‌ ర్యాలీని అమిత్‌ షా  ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకే భాజపా పోరాడుతోందని పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని