Covid:ఆర్పీ సింగ్ ఇంట్లో విషాదం   - former india fast-bowler rp singhs father dies of covid-19
close
Updated : 12/05/2021 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid:ఆర్పీ సింగ్ ఇంట్లో విషాదం  

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనా మహమ్మారి క్రీడాకారుల కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఇప్పటికే  భారత మహిళా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి తల్లి, సోదరి రెండు వారాల వ్యవధిలోనే కొవిడ్‌ బారినపడి మరణించగా.. టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ పియూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా, రాజస్థాన్ రాయల్స్‌ ఆటగాడు  చేతన్‌ సకారియా తండ్రి  కంజీభాయ్ కూడా  కరోనాతో పోరాడి కన్నుమూశారు. 

తాజాగా టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ (రుద్ర ప్రతాప్‌) సింగ్ తండ్రి  శివప్రసాద్‌ సింగ్ సైతం బుధవారం కొవిడ్ బారినపడి మరణించారు.  ఈ విషయాన్ని ఆర్పీ సింగ్ ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘నా తండ్రి శివప్రసాద్‌ సింగ్ ఇకలేరనే  విచారకరమైన విషయాన్ని తీవ్రమైన దుఃఖంతో తెలియజేస్తున్నా. ఆయన కొవిడ్‌తో బాధపడుతూ ఈ రోజు మమ్మల్ని విడిచివెళ్లారు. నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని మీరంతా భగవంతుణ్ని ప్రార్థించాలని కోరుతున్నా.’ అని ట్వీట్ చేశాడు.

2007లో నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత జట్టులో ఆర్పీసింగ్ ఉన్నాడు.  14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20లు ఆడిన ఈ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ 2018లో రిటైర్మైంట్ ప్రకటించాడు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని