మనసు చాటిన మాజీ మిస్ వరల్డ్‌ - former miss world Manushi Chhillar auctions her painting to raise funds for frontline workers
close
Published : 18/08/2020 23:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనసు చాటిన మాజీ మిస్ వరల్డ్‌

తాను రూపొందించిన పెయింటింగుల వేలం

దిల్లీ: మాజీ మిస్‌ వరల్డ్‌, నటి మానుషి చిల్లర్‌ మానవతా హృదయాన్ని చాటుకుంది. కరోనాకు తెగించి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌‌ వారియర్స్‌కు చేయూతనందించేందుకు వారిపై వేసిన పెయింటింగ్స్‌ను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ‘స్మైల్‌’ స్వచ్ఛందసంస్థతో కలిసి ఆన్‌లైన్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించనుంది. ఎగ్జిబిషన్‌ ద్వారా పోగైన డబ్బును కొవిడ్‌ వారియర్స్‌తోపాటు వారి కుంటుంబాలకు పీపీఈ కిట్లు అందించేందుకు ఉపయోగించనున్నట్లు స్పష్టం చేసింది.

‘ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకుంటున్నాం. కానీ రైతులు, ట్రక్‌ డ్రైవర్లు, అనేక మంది కార్మికులు మన కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. మనసుతో మనకోసం పనిచేస్తున్న వీరందరికి స్మైల్‌ ఫౌండేషన్‌ ద్వారా పీపీఈ కిట్లు అందించనున్నాం’ అని మానుషి చిల్లర్‌ పేర్కొంది.  ‘కష్ట సమయంలో మన కోసం పనిచేస్తున్న హీరోలపై పెయింటింగులు రూపొందించాను. వాటినే ఇప్పుడు వేలం వేయాలనుకుంటున్నాను’ అని స్వతహాగా పెయింటర్‌ అయిన మానుషి తెలిపింది. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ‘పృథ్వీరాజ్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది మానుషి చిల్లర్‌. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ సరసన నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని