ప్రతి కేసులో ఎంసీఏ ఎందుకు?
close
Published : 26/05/2020 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతి కేసులో ఎంసీఏ ఎందుకు?

ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను తోసిపుచ్చిన ట్రైబ్యునల్‌

దిల్లీ: దివాలా, కంపెనీ చట్టాలకు సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ(ఎమ్‌సీఏ)ను ఒక కక్షిదారుగా చేర్చాలని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశాలను జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) పక్కకు పెట్టింది. ఒక కొత్త నిబంధనను ప్రవేశపెడుతూ ఎన్‌సీఎల్‌టీ జారీ చేసిన ఆదేశాలు ‘అధికారానికి మించి’ ఉన్నాయని ఎన్‌సీఎల్‌ఏటీ ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఎమ్‌సీఏ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసిన అనంతరం పైవిధంగా వ్యాఖ్యానించింది. దివాలా స్మృతి, కంపెనీల చట్టం కింద అన్ని ధర్మాసనాల్లో దాఖలయ్యే పిటిషన్లలో ఎమ్‌సీఏను ఒక పార్టీగా చేర్చాలని నవంబరు 22, 2019న ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసింది. కేసును బట్టి ఈ నిర్ణయం ఉండాలి మినహా ప్రతి కేసుకు అవసరం లేదని చెబుతూ ఆ ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ తోసిపుచ్చింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని