భగవత్ ‘విడాకుల’ వ్యాఖ్యలపై సోనమ్‌ ఆగ్రహం
close
Published : 17/02/2020 19:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భగవత్ ‘విడాకుల’ వ్యాఖ్యలపై సోనమ్‌ ఆగ్రహం

దిల్లీ: ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ విడాకులపై చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివైన వారేవరైనా ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఆరెస్సెస్‌ సమావేశానికి మోహన్‌ భగవత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన భగవత్‌.. ‘చదువుకున్న, పలుకుబడి ఉన్న కుటుంబాల్లోనే విడాకుల కేసులు ఎక్కువగా జరుగుతాయి’ అని వ్యాఖ్యానించారు. చదువుతో వచ్చిన అహంకారం వల్లే కుటుంబాలు విడిపోతున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సోనమ్‌ ట్విటర్‌ వేదికగా ఖండించారు. ఓ మీడియా కథనాన్ని షేర్‌ చేసిన ఆమె.. ‘తెలివైన వ్యక్తి ఎవరైనా ఇలా మాట్లాడుతారా? ఈ మూర్ఖపు ప్రకటనలను వెనక్కి తీసుకోవాలి’ అని భగవత్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని