జాన్వి కపూర్‌ కుటుంబానికి కొవిడ్‌ టెస్ట్‌..!
close
Published : 06/06/2020 03:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాన్వి కపూర్‌ కుటుంబానికి కొవిడ్‌ టెస్ట్‌..!

14 రోజుల క్వారంటైన్‌ పూర్తి

ముంబయి: ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ ఇంట్లో పనిచేసిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బోనీ, ఆయన ఇద్దరు కుమార్తెలు జాన్వి, ఖుషిలతోపాటు ఇంట్లో పనిచేసిన వ్యక్తులు కూడా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా... అందరికీ నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని బోనీ ట్వీట్‌ చేశారు. అందరి ఆరోగ్యం బాగుందని పేర్కొన్నారు.

‘నాకు, నా ఇద్దరు కుమార్తెలతోపాటు ముగ్గురు సిబ్బందికి కొవిడ్‌-19 నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని చెప్పడం సంతోషంగా ఉంది. మా 14 రోజుల క్వారంటైన్‌ కాలం ముగిసింది. ఫ్రెష్‌గా ముందుకు సాగబోతున్నాం. కొవిడ్‌ బారినపడ్డ వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. మిగిలిన వారంతా సురక్షితంగా ఉండండి. ప్రభుత్వ సూచనల్ని పాటించండి. ఈ సందర్భంగా నా కుటుంబ సభ్యుల తరఫున మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. కలిసికట్టుగా మనం కరోనాను ఎదుర్కోవచ్చు’ అని బోనీ పేర్కొన్నారు. ఆయన తెలుగు సినిమా ‘వకీల్‌ సాబ్‌’ను నిర్మిస్తున్నారు. జాన్వి నెట్‌ఫ్లిక్‌ సిరీస్‌ ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ తర్వాత ‘గుంజాన్‌ సక్సేన్‌’లో నటిస్తున్నారు. శరణ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 24న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదాపడింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని