మంచు లక్ష్మి.. అయితే నాకు రూ.లక్ష పంపు!
close
Published : 12/06/2020 23:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంచు లక్ష్మి.. అయితే నాకు రూ.లక్ష పంపు!

నెటిజన్‌ కామెంట్‌.. నటి ఏమన్నారంటే?

హైదరాబాద్‌: స్నేహంపై తన అభిప్రాయాల్ని పంచుకుంటూ నటి మంచు లక్ష్మి ట్వీట్లు చేశారు. స్నేహితులు మన హద్దుల్ని చెరిపి ముందుకు తీసుకెళ్తారని, మన వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుతారని అన్నారు. కష్టాల్లో మన చేతులు పట్టుకుని ధైర్యం చెబుతారని.. విజయం సాధించినప్పుడు వేడుకలు జరుపుతారని పేర్కొన్నారు. మంచు లక్ష్మి చేసిన ఈ ట్వీట్‌కు రకుల్‌ స్పందించారు. ‘నువ్వు నాకు కేవలం స్నేహితురాలివి మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ #soulsista’ అని కామెంట్ చేశారు. రకుల్‌ రిప్లైకి మంచు లక్ష్మి మురిసిపోతూ.. ‘వావ్‌ బేబీ..’ అని ప్రతిస్పందించారు.

కాగా మంచు లక్ష్మి చేసిన ట్వీట్‌కు ఓ నెటిజన్‌ విభిన్నంగా స్పందించాడు. ‘రూ. లక్ష పంపు ఫ్రెండ్‌.. వచ్చే వారం ఇస్తా..’ అని అడిగాడు. ‘నువ్వు నా స్నేహితుడివి కాదు..’ అని ఆమె పేర్కొన్నారు. వీరి సంభాషణ నెటిజన్లను నవ్వించింది. మంచు లక్ష్మి లాక్‌డౌన్‌ కాలాన్ని ఇంట్లోనే గడిపారు. వంటలు, వ్యాయామాలు చేస్తూ.. తన కుమార్తెతో సమయం గడిపారు. ఈ సందర్భంగా తీసిన పలు వీడియోలు, ఫొటోల్ని పంచుకున్నారు. మంచు లక్ష్మి 2018లో ‘Mrs. సుబ్బలక్ష్మి’ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని