దర్శకుడిపై పూనమ్‌కౌర్‌ సంచలన వ్యాఖ్యలు
close
Published : 17/06/2020 17:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దర్శకుడిపై పూనమ్‌కౌర్‌ సంచలన వ్యాఖ్యలు

‘నేను చనిపోతే ఒక్క రోజు వార్తవుతుంది’ అన్నాడు!

హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని టాలీవుడ్‌ నటి పూనమ్‌కౌర్‌ అన్నారు.. దీన్ని అధిగమించేందుకు ఓ దర్శకుడిని సూచనలు అడిగితే.. ఆయన దారుణంగా మాట్లాడారని గుర్తు చేసుకుంటూ ఆమె బుధవారం వరుస ట్వీట్లు చేశారు. పరోక్షంగా ఆయన్ను విమర్శించారు. బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య నేపథ్యంలో ఆమె గతంలో చోటుచేసుకున్న ఈ ఘటనని గుర్తు చేసుకున్నారు. ‘నా మానసిక పరిస్థితి బాగాలేదు.. ఏం చేయాలి. ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. నాతో కాసేపు మాట్లాడండి?.. అని ఓ దర్శకుడిని అడిగా. అయితే ఆయన నాతో సరిగా వ్యవహరించలేదు. పైగా.. ఏమీ జరగదు.. నువ్వు చనిపోతే ఒక్క రోజు న్యూస్‌ అవుతావ్‌ అని ఆ దర్శకుడు ఎగతాళిగా అన్నాడు. ఆ మాటలు నాకు విరక్తి తెప్పించాయి’

‘ఆ దర్శకుడు ఎన్నో రంగాల్ని కంట్రోల్‌ చేస్తున్నాడు. పరోక్షమైన ఆర్టికల్స్‌ ద్వారా ఆయన నాతో మాట్లాడిన తీరు ఇంకా బాధించింది. మీడియా రాసిన అనవసరమైన వార్తలు నాలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. నేను నేరుగా అతడికి సమాధానం ఇచ్చా. నేనెందుకు ఇలా ఉండాలి అనుకున్నా. మారేందుకు ప్రయత్నిస్తున్నా’.

‘నువ్వు(దర్శకుడు) నిశ్శబ్దంగా నన్ను సినిమాల నుంచి నిషేధించావు. ఫర్వాలేదు.. నువ్వు గురూజీవి కాదు. స్వలాభం కోసం నీ స్నేహితుల్ని కూడా మభ్యపెడుతూ జీవిస్తున్నావు. నీ వల్ల లాభం పొందిన వారు నాకు తెలిసి ఎవరూ లేరు. నీ అసలు రంగు చూసి.. షాక్‌ అయ్యా. నేను ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ ఇప్పటికీ నాకు షాక్‌లు ఇస్తూనే ఉన్నావు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌లా నేనూ ఫీల్‌ అయ్యేలా చేస్తున్నావు. కానీ అలా నా జీవితాన్ని ముగించాలని నేను అనుకోవడం లేదు. ఇప్పటికీ థెరపీ తీసుకుంటున్నా’ అని ఆమె వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం బయటపెట్టలేదు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని