‘చిత్రం’ సినిమాతో చిత్రసీమలోకి మెరుపులా దూసుకొచ్చిన దర్శకుడు తేజ. కొత్తదనం నిండిన కథతో కొత్త ప్రతిభను తెరకు పరిచయం చేస్తూ.. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. దీంతోనే హీరో ఉదయ్ కిరణ్ వెండితెరకు పరిచయమయ్యారు. ఇప్పుడీ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’ని తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు తేజ. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తొలి భాగానికి తగ్గట్లుగానే మంచి యువతరం మెచ్చే ప్రేమకథతో స్క్రిప్ట్ సిద్ధం చేశాం. ఈ సినిమాతో 45మంది కొత్త నటీనటులను తెరకు పరిచయం చేయనున్నాం. త్వరలో ఆడిషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తాం. తొలి ‘చిత్రం’కు బాణీలందించిన ఆర్పీ పట్నాయక్.. ఈ సీక్వెల్‌కీ స్వరాలందిస్తున్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. 70శాతం వరకు చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. నిర్మాతలు ఎవరన్నది ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో మర్ని వివరాలు ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
- కీర్తి.. కొత్త ప్రయాణం
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్