భీష్మ ఏకాదశి సందర్భంగా కథానాయకుడు బాలకృష్ణ నుంచి సినీప్రియులకు ఓ చక్కటి కానుక అందింది. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో ఆయన భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్‌ను మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాన్న.. ఆయన వయసుకి మించిన భీష్మ పాత్రలో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకున్నారు. అందుకే నాకూ ఆ పాత్రంటే చాలా ఇష్టం. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాం. అయితే నిడివి ఎక్కువ అవడం వల్ల చిత్రంలో వాటిని ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన అపురూప ఫొటోలను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంటున్నాను’’ అన్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి హిట్ల తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. మే 28న విడుదలవుతుంది.
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
- ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్ హీరోగా కొత్త సినిమా!
-
రానా ‘అరణ్య’ ట్రైలర్
- పవన్ భార్యగా సాయిపల్లవి!
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
గుసగుసలు
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది