శ్రీవిష్ణు.. చోర గాథ
close
Updated : 12/06/2021 08:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవిష్ణు.. చోర గాథ

వైవిధ్యభరిత కథల్లో నటించేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఇప్పుడీ పంథాలోనే ఆయన హిసిత్‌ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ అనే చిత్రం చేస్తున్నారు. మేఘా ఆకాష్‌, సునయన కథానాయికలు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈనెల 18న టీజర్‌ విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిత్ర బృందం శుక్రవారం ‘చోర గాథ బై గంగవ్వ’ పేరుతో ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ‘‘ఊ కొట్టే కథ చెబుతా.. ఊ కొడతావా’’ అంటూ గంగవ్వ వాయిస్‌ ఓవర్‌తో.. 2డీ యానిమేషన్‌లో ఈ టీజర్‌ రూపొందించారు. ‘‘అనగనగా ఓ సూర్యుడుండేటోడు. ఆ సూర్యుడేమో భూమికి ప్రాణం ఇచ్చాడు. భూమి నుంచి కోతి, బంగారం వచ్చాయి. కోతి మనిషి అయ్యింది.. బంగారం కిరీటం అయ్యింది. మనిషి దొంగ అయ్యిండు.. కిరీటం రాజు అయ్యింది’’ అంటూ టీజర్‌ ఓ పిట్ట కథలా ఆసక్తికరంగా సాగింది. దీంట్లో రాజు ఎవరు? దొంగ ఎవరు?.. వీళ్ల కథేంటి? అన్నది టీజర్‌లో చూపించనున్నారు. ఆఖర్లో.. ‘రాజరాజు వచ్చే లోకాలు మెచ్చే.. రాజ రాజ చోర వచ్చే బాధలెన్నో తెచ్చే’’ అంటూ వినిపించిన డైలాగ్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: వేదరామన్‌.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని