మోహన్‌లాల్, ఎన్టీఆర్‌ మరోసారి?
close
Published : 09/04/2020 11:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోహన్‌లాల్, ఎన్టీఆర్‌ మరోసారి?

హైదరాబాద్‌: మోహన్‌లాల్‌, ఎన్టీఆర్‌ కీలక పాత్రల్లో నటించిన ‘జనతా గ్యారేజ్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. మరోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారా? అందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వేదిక కాబోతోందా? అంటే టాలీవుడ్‌లో ఇదే టాక్‌ నడుస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆయన ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. ఇక కొమరం భీంగా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. కొమరం భీం జీవితంలో ఆయన బాబాయ్‌ ప్రధాన పాత్ర పోషించారట. అందుకే ఆ పాత్ర కోసం మోహన్‌లాల్‌ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ‘జనతా గ్యారేజ్‌’లో మోహన్‌లాల్‌-ఎన్టీఆర్‌లు కనిపించిన సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో కొమరం భీం బాబాయ్‌ పాత్రకు మోహన్‌లాల్‌ సరిపోతారని జక్కన్న భావించారట. ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని, దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆలియా భట్‌, ఓలివియా మోరిస్‌లు నాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని