‘సామజవరగమన’ రాసేటప్పుడు బన్నిని అయిపోయా!
close
Published : 07/01/2020 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సామజవరగమన’ రాసేటప్పుడు బన్నిని అయిపోయా!

హైదరాబాద్‌: ‘సామజవరగమన’ పాట రాసేటప్పుడు తాను అల్లు అర్జున్‌ని అయిపోయాననీ.. అందుకే పాట అంత అందంగా వచ్చిందని అన్నారు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. సోమవారం రాత్రి ఈ చిత్ర మ్యూజికల్‌ నైట్‌ జరిగింది. ఈ సందర్భంగా సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుకకు హాజరైన వారందరికీ నూతన సంతవ్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వేడుక చూస్తుంటే, సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలా ఉంది. త్రివిక్రమ్‌ ఈ సినిమాకు ‘అల వైకుంఠపురములో’ అని మంచి పేరు పెట్టారు. సరస్వతి కటాక్షం ఎంత వైవిధ్యంగా ఉంటుందో ఈ కార్యక్రమం చూపింది. సంగీతం, సాహిత్యం, నృత్యం.. ఇలా అనేక రూపాల్లో దర్శనమిచ్చింది. బన్నిని చూస్తుంటే నన్ను నేను మర్చిపోతా. అతను డ్యాన్స్‌ చేస్తుంటే కరెంట్‌ తీగ ఫుల్‌ ఎనర్జీతో ఊగిపోతున్నట్లు ఉంటుంది. అంతకుమించి చాలా సంస్కారవంతుడు. నెటిజన్లు అందరూ మనసు భాషతో ఈ పాటను వింటున్నారు. ‘సామజవరగమన’ పాటను నేనూ, త్రివిక్రమ్‌ రాశాం. ఈ పాట రాసేటప్పుడు నేను అల్లు అర్జున్‌ను అయిపోయా. త్రివిక్రమ్‌ ఇచ్చిన ఐడియాతోనే ఈ పాట రాశా. దీనికి అందమైన ట్యూన్‌ ఇచ్చిన తమన్‌కు ప్రత్యేక అభినందనలు. సరస్వతి.. లక్ష్మి ఒక చోట ఉండవని అంటారు. కానీ, ఈ సినిమా విడుదలైన తర్వాత రెండూ ఒకే చోట కళకళలాడుతూ ఉంటాయి.’’ అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నారు.

అలనాటి అగ్ర కథానాయిక టబు మాట్లాడుతూ.. ‘‘పదేళ్ల తర్వాత తెలుగు సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకన్నా మంచి సినిమా మరొకటి ఉండదని అనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్‌ గారికి ధన్యవాదాలు’’ అని అన్నారు. 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని