అదరగొడుతోన్న యశ్‌ న్యూ లుక్‌
close
Updated : 08/01/2020 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదరగొడుతోన్న యశ్‌ న్యూ లుక్‌

‘కేజీఎఫ్‌-2’ కొత్త పోస్టర్‌ ఆగయా

హైదరాబాద్‌: పాన్‌ ఇండియా చిత్రంగా భారీ విజయాన్ని అందుకున్న కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌’. ఈ చిత్రంతో కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌ అందరికీ సుపరిచితుడయ్యారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌2’ పేరుతో ఈ సినిమాకు రెండో భాగం తెరకెక్కుతోంది. క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసిన ‘కేజీఎఫ్‌ చాప్టర్‌2’ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. బుధవారం యశ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ‘కేజీఎఫ్‌2’ న్యూలుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈరోజు టీజర్‌ను విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేకపోతోన్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెలియజేశారు.

‘హాయ్‌.. 6వ తేదీ వరకూ షూటింగ్‌ జరగడంతో 7వ తేదీన ఇక్కడికి చేరుకున్నాం. దీంతో జనవరి 8న యశ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ టీజర్‌ను విడుదల చేయలేకపోతున్నాం. ‘కేజీఎఫ్‌2’ మీద మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చాలా గొప్పవి. ‘కేజీఎఫ్‌‌2’ ఉత్తమంగా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. అందుకు తగ్గట్టు మేము కూడా ఎక్కడ రాజీ పడడం లేదు. మీకు ది బెస్ట్‌ అందించడానికి ఆలస్యమవుతున్నందుకు క్షమించండి. యశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని జనవరి 8న  ఉదయం 10.08 గంటలకు ‘కేజీఎఫ్‌ 2’ సెకండ్‌ లుక్‌ను విడుదల చేస్తాం. అది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని ప్రశాంత్‌ నీల్‌ తెలిపారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని