ఆ వార్తల్లో నిజం లేదు
close
Updated : 22/04/2020 08:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ వార్తల్లో నిజం లేదు

అనుష్క ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. మాధవన్‌, అంజలి, షాలిని పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.

అయితే, తాజాగా ఈ సినిమాపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ప్రకటించింది నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ. కరోనా ప్రభావంతో థియేటర్లలో కాకుండా... డిజిటల్‌ వేదికల్లో విడుదల కాబోతోందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని నిర్మాణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘చిత్రీకరణ మొదలైన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు మా నటులు, సాంకేతిక బృందం ఎంతగానో సహకరించారు. ముఖ్యంగా అనుష్క. మా సినిమాకి సంబంధించిన ఏ విషయమైనా అధికారికంగా ప్రకటిస్తామ’’ని పేర్కొంది.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని