ఐశ్వర్యరాయ్‌ పాత్ర కోసం సౌందర్యను కలిస్తే..! 
close
Updated : 03/05/2020 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐశ్వర్యరాయ్‌ పాత్ర కోసం సౌందర్యను కలిస్తే..! 

అజిత్‌ ఆస్పత్రి బెడ్‌పై ఉండగా కథ చెప్పా: దర్శకుడు
‘ప్రియురాలు పిలిచింది’కి 20 ఏళ్లు
 

చెన్నై: స్టార్స్‌ మమ్ముట్టి, అజిత్‌, అబ్బాస్‌, ఐశ్వర్యరాయ్‌, టబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ప్రియురాలు పిలిచింది’. తమిళ దర్శకుడు రాజీవ్‌ మేనన్‌ తెరకెక్కించిన ఈ సినిమా 2000లోనే భారీ మల్టీస్టారర్‌గా రూపొందింది. ఇంతమంది స్టార్స్‌ కలిసి నటించిన సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే.. సినిమా విజయం అందుకుంది. ఈ చిత్రం విడుదలై శుక్రవారంతో 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రాజీవ్‌ ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ప్రియురాలు పిలిచింది’ ప్రీ ప్రొడక్షన్‌ను గుర్తు చేసుకున్నారు. మల్టీస్టారర్‌ను రూపొందించడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు.

‘ఈ సినిమా కోసం ముందు టబును ఎంచుకున్నాం. ఆమెకు స్క్రిప్టు కూడా బాగా నచ్చింది. కానీ ఆమె చెల్లి పాత్రకు (మీనాక్షి) నటిని ఎంపిక చేయడం కష్టమైంది. తొలుత మంజూ వారియర్‌ను కలిశా. ఆమెకు పాత్ర నచ్చింది.. కానీ నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలన్నారు. ఆ తర్వాత సౌందర్యను కలిశా. ఆమెతో నేను అప్పటికే ఓ ప్రకటన కోసం పనిచేశా. స్క్రిప్టు చెప్పిన తర్వాత.. సినిమా క్లైమాక్స్‌ ఏంటని ఆమె సోదరుడు అడిగారు. కానీ అప్పుడు మాకే క్లైమాక్స్‌పై స్పష్టత లేదు. ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. మరోపక్క షూటింగ్‌ జరగాల్సిన తేదీ దగ్గరపడుతోంది. నాకు కంగారు ఎక్కువైపోయింది. ఓ రోజు నా భార్య ఐశ్వర్యరాయ్‌ పేరు చెప్పింది. ఆమె టబు చెల్లి పాత్రకు బాగుంటారని అంది. నేను ఐశ్వర్యరాయ్‌ను కలిశా. నిజానికి అప్పట్లో ఆమెకు నా సినిమాలో నటించేంత సమయం లేదు. కానీ పాత్ర బాగా నచ్చడంతో డేట్స్‌ కుదుర్చుకుని మరీ నటించారు’.

‘కష్టాలు ఎదుర్కొనే దర్శకుడు మనోహర్‌ పాత్ర (అజిత్‌ నటించారు) కోసం ప్రశాంత్‌ను కలిశా. ఆయన ఐశ్వర్యరాయ్‌కు జంటగా నటిస్తానని, టబుకు జోడీగా నటించనని చెప్పారు. ఆపై అజిత్‌ గుర్తొచ్చారు. ఏదో ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్లా. ఆసుపత్రి బెడ్‌పై ఉండగానే కథ నరేట్‌ చేశా. ఆపై సినిమాకు సంతకం చేశారు. ఈ సినిమాతో విక్రమ్‌కు బంధం ఉంది. అప్పటికే నేను ఓ ప్రకటన కోసం విక్రమ్‌తో పనిచేశా. అంతేకాదు ‘బొంబాయి’ సినిమా కోసం ఆయన పేరును సిఫారస్సు చేశా. ‘మెరుపు కలలు’ సినిమాలో ప్రభుదేవాకు కొత్త స్వరం ఇవ్వాలని నిర్మాత అభిప్రాయపడ్డారు. దీంతో విక్రమ్‌ను డబ్బింగ్‌ చెప్పమని కోరా. ఆయన కూడా ఓకే అన్నారు. ఆపై అబ్బాస్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పి, నాకు సాయం చేశారు. విక్రమ్‌ను కూడా ‘ప్రియురాలు పిలిచింది’ సినిమా కోసం తీసుకోవాలని అనుకున్నా.. కానీ కుదరలేదు’ అని రాజీవ్‌ గుర్తు చేసుకున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని