ఛార్మి.. ఇలాంటి చెత్త వీడియో పెడతావా!
close
Published : 03/03/2020 13:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఛార్మి.. ఇలాంటి చెత్త వీడియో పెడతావా!

కరోనా నేపథ్యంలో నటి వ్యాఖ్యలు.. నెటిజన్ల మండిపాటు

హైదరాబాద్‌: ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై కథానాయిక ఛార్మి అనుచిత టిక్‌టాక్‌ వీడియో చేసి.. విమర్శలు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో తొలిసారిగా సోమవారం మొదటి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆవేదన వ్యక్తం చేయాల్సింది పోయి.. ఛార్మి నవ్వుతూ టిక్‌టాక్‌ వీడియో చేశారు. ‘ఆల్‌ ది బెస్ట్‌ గాయ్స్‌.. ఎందుకు చెబుతున్నానో తెలుసా? కరోనా వైరస్‌ దిల్లీ, తెలంగాణకు వచ్చేసింది. ఇప్పుడే ఈ వార్త తెలిసింది. ఆల్‌ ది బెస్ట్..’ అని నవ్వుతూ అనడంతో నెటిజన్లు మండిపడ్డారు.

‘వైరస్‌ వల్ల ఎన్నో ప్రాణాలు బలి అవుతుంటే ఇలా మాట్లాడుతావా?, చెత్త వీడియో షేర్‌ చేస్తావా, కరోనా అంటే ఐస్‌క్రీమ్‌ పేరు అనుకున్నావా?..’ అని రకరకాల కామెంట్లు చేశారు. దీంతో ఛార్మి ఆ వీడియో డిలీట్‌ చేశారు. ‘మీ కామెంట్లు చూశా. నన్ను క్షమించండి. సరైన ఆలోచన లేకుండా దాన్ని షేర్‌ చేశా. ఇకపై ఏదైనా విషయంపై స్పందించేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను’ అని పోస్ట్‌ చేశారు. మరోపక్క సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం మరో ముగ్గురు కరోనా అనుమానితులు చేరారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని