వావ్ ఆర్య.. వాట్‌ ఏ ఛేంజ్‌
close
Published : 07/03/2020 19:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వావ్ ఆర్య.. వాట్‌ ఏ ఛేంజ్‌

సాధారణ లుక్‌ నుంచి అసాధారణ లుక్‌లోకి..

చెన్నై: ట్రెండ్‌, స్టైల్‌, సినిమాలను బట్టి హీరోలు తమ శరీరాకృతిలో మార్పులు చూపిస్తుంటారు. కథ డిమాండ్‌ చేస్తే సిక్స్‌ ప్యాక్‌ బాడీతో మెప్పించేందుకు కూడా హీరోలు వెనుకడారు. సిక్స్‌ప్యాక్‌లో కనిపించడం కోసం జిమ్‌లో ఎంతో కఠోరసాధన చేస్తారనే విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్‌ నటుడు ఆర్య సైతం అదే బాటలోకి చేరారు. ఆయన కథానాయకుడిగా పా రంజిత్‌ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆర్య బాక్సర్‌లా కనిపించనున్నారు. ఆర్య 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీలుక్‌ను సైతం ఆర్య ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ సమయంలో ఆర్య లుక్‌ను చూసిన అభిమానులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇదిలా ఉండగా పా రంజిత్‌ సినిమా కోసం ఆర్య.. బాక్సర్‌ లుక్‌లో సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. తాజాగా ఆర్య ఇన్‌స్టా వేదికగా రెండు ఫొటోలను షేర్‌ చేశారు. జిమ్‌లో వర్కౌట్లు ప్రారంభించడానికి ముందు వర్కౌట్లు చేసిన తర్వాత అని ఆయన పేర్కొన్నారు. ‘ఏడు నెలలపాటు జిమ్‌లో కార్డియో, బాక్సింగ్‌ చేయడం వల్ల నేను ఇలా మారాను. నా ట్రైనర్లు జై, సంతోష్‌, తిరు, ప్రసాద్ లేకపోతే ఇది నాకు సాధ్యం కాదు. వాళ్లే నన్ను ఇలా మార్చారు. లవ్‌ యూ’ అని ఆర్య పేర్కొన్నారు. ఆర్య లుక్‌లో అసాధారణమైన మార్పును చూసి నెటిజన్లు ఆశ్చరానికి లోనవుతున్నారు. ‘వావ్‌.. ఆర్య’, ‘వాట్‌ ఏ లుక్‌ ఆర్య’, ‘అద్భుతం’ అని కామెంట్లు చేస్తున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని