స్వీయ నిర్బంధంలో సుహాసిని కుమారుడు
close
Published : 23/03/2020 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వీయ నిర్బంధంలో సుహాసిని కుమారుడు

నటి ఎలా మాట్లాడుతున్నారో చూడండి

చెన్నై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం, నటి సుహాసినిల కుమారుడు నందన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన ఇటీవల లండన్‌ నుంచి ఇండియా వచ్చారు. విమానాశ్రయంలో వైద్య పరీక్షల తర్వాత  ముందు జాగ్రత్తగా తనను తాను గృహ నిర్బంధం చేసుకున్నారు. ‘లండన్‌ నుంచి వచ్చి 5 రోజులు అవుతోంది. అప్పటి నుంచి స్వీయ నిర్బంధంలోనే ఉన్నా. ఇది నాకు నేను తీసుకున్న నిర్ణయం. మరో 14 రోజుల వరకు ఈ గది దాటి బయటికి రాను. ఎంత బోర్‌ కొట్టినా సరే ఇలానే ఉంటా. మన చుట్టూ ఉన్న వారి కోసం మనం చేయగలిగే అతి చిన్న పని ఇది’ అని నందన్‌ ట్వీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో సుహాసిని తన కుమారుడితో గ్లాస్‌ డోర్‌కు ఇటు వైపు నిలబడి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను నటి ఖుష్బూ షేర్‌ చేశారు. ‘బాధ్యత ఉన్న వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తారు. సుహాసిని, నందన్‌కు నా కుడోస్‌. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు’ అని ప్రశంసించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా వారిని అభినందించారు. ‘మీరే స్ఫూర్తి, మీ ఓపికకు థాంక్స్‌, ఇది అందరికీ ఓ పాఠం..’ అంటూ రకరకాల కామెంట్లు చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని