ఎన్టీఆర్‌ అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది!
close
Published : 19/05/2020 19:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది. మే 20న ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్ర బృందం ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయాలని భావించింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా సాంకేతిక నిపుణులు కలిసి పనిచేయడానికి వీలులేకపోవడంతో టీజర్‌ రూపొందించడం కష్టంగా మారింది. దీంతో నిరాశ చెందిన అభిమానుల్లో.. తారక్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ కాస్త ఉత్సాహం నింపారు. ‘బుధవారం తారక్‌ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన అభిమానుల కోసం నా వద్ద ప్రత్యేకమైంది ఉంది. నా ట్విటర్‌లో దాన్ని మీతో షేర్‌ చేసుకోబోతున్నా’ అంటూ ఈరోజు ఉదయం వెల్లడించిన లాయిడ్‌ సాయంత్రానికి ఆ గిఫ్ట్‌ ఇచ్చేశారు.

ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఎవరూ ఇప్పటివరకూ చూడని తారక్‌ ఫొటోను పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా’’ అని తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్‌ఆర్ఆర్‌’లో కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు తారక్‌. ఇందుకోసం ఆయన కసరత్తులు చేసి ఫిట్‌గా తయారయ్యారు. చారిత్రక నేపథ్యం ఉన్న పాత్ర కావడం, యోధుడిగా కనిపించడం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. కొమరం భీం పాత్ర కోసం ఎన్టీఆర్‌ ఎలా మేకోవర్‌ అయ్యారో ఈ చిత్రం చూస్తేనే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోతో ఎన్టీఆర్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని