శ్రద్ధాదాస్‌తో దేవిశ్రీ ఆటాపాటా.. అదుర్స్‌..!
close
Updated : 25/05/2020 10:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రద్ధాదాస్‌తో దేవిశ్రీ ఆటాపాటా.. అదుర్స్‌..!

అమెరికా రిహార్సల్స్‌లో..

హైదరాబాద్‌: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తన తండ్రి సత్యమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘డీఎస్పీ సింగిల్‌ షాట్‌ వీడియోస్‌’ పేరుతో దీన్ని తన యూట్యూబ్‌ ఛానెల్‌లో విడుదల చేశారు. ‘శ్రద్ధాదాస్‌తో ‘రాఖీ రాఖీ..’. నాకు రిహార్సల్‌కు, ఫైనల్‌ షోకు తేడా తెలియదు. ప్రదర్శనను ఇష్టపడటం మాత్రమే తెలుసు. నాకు ఈ గుణాన్ని నేర్పించిన మా నాన్నకు థ్యాంక్స్‌. హ్యాపీ మ్యూజికల్‌ డే డియరెస్ట్‌ డాడీ’ అని ఆయన ట్వీట్‌ చేశారు. అమెరికాలో జరిగిన షోలో పాల్గొనేందుకు ముందు దేవిశ్రీ, శ్రద్ధా కలిసి రిహార్సల్స్‌ చేసిన వీడియో ఇది. ఇద్దరు పోటాపోటీగా డ్యాన్స్‌ చేస్తూ అలరించారు.

ఈ వీడియోకు శ్రద్ధా స్పందించారు. ‘మీ నాన్నను విష్‌ చేసే వీడియోలో నా వంతు ఉండటం గర్వంగా ఉంది. డీఎస్పీ యూఎస్‌ఏ టూర్‌లో తీసిన వీడియో ఇది. ఆరోజు షో చాలా ఉత్సాహంగా జరిగింది. ఓసారి దేవిశ్రీ ఎనర్జీ చూడండి’ అని ఆమె పేర్కొన్నారు. ‘ధన్యవాదాలు శ్రద్ధాదాస్‌. నువ్వు లిరిక్స్‌ నేర్చుకుని, ఎంతో ఇష్టంగా టూర్‌లో పాడినందుకు మెచ్చుకుంటున్నా. నీ సింగింగ్‌ నైపుణ్యం గురించి ప్రజలకు చాలా తెలియాలి’ అని దేవిశ్రీ రిప్లై ఇచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని