రాజధాని ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇక్కడికే వస్తుంది
close
Updated : 21/01/2020 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధాని ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇక్కడికే వస్తుంది

జనసేన అధినేత పవన్ కల్యాణ్

అమరావతి : మూడు రాజధానులపై ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘సోమవారం ఉదయం నుంచి రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. వారిని పరామర్శించేందుకు బయలుదేరుతుంటే నన్ను డీఐజీ స్థాయి అధికారి పోలీసు బలగాలతో వచ్చి అడ్డుకున్నారు. పార్టీ ఆఫీసు నుంచి బయటకు అడుగు పెట్టనివ్వలేదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వైకాపా స్థిరత్వం ఇవ్వలేకపోతోంది. 2015లోనే భూసేకరణ సమయంలో ఈ పరిణామం ఉహించాం. బిల్లులు పెట్టి రాజధాని మార్పు చేయాలనుకున్నా అది తాత్కాలికం మాత్రమే. అమరావతి శాశ్వత రాజధానిగా ఇక్కడే ఉంటుంది. రైతులు 33 వేల ఎకరాల భూమి ఇచ్చారు. పచ్చని పంట పొలాల్లో ఇప్పుడు ఎన్నో నిర్మాణాలు చేపట్టారు. వైకాపా ప్రజలకు ద్రోహం చేస్తోంది. ప్రతిపక్ష హోదాలో ఉండి 2015లో ఎందుకు భూసేకరణ అడ్డుకోలేదు. ఉత్తరాంధ్ర మీద ప్రేమతో రాజధాని మార్పు చేయడంలేదు. అక్కడి భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకే రాజధాని అంటున్నారు. అంత ప్రేమ ఉంటే తిత్లీ తుపాను సమయంలో అటువైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారు. రాజధాని ఇక్కడే ఉండాలి. రాజధాని మార్పునకు కేంద్రం ఒప్పుకొందని వైకాపా అసత్య ప్రచారాలు చేస్తోంది. నమస్కారం పెట్టినంత మాత్రాన అది రాజధానికి ఒప్పుకొన్నట్లు కాదు. 

రాజధాని నిర్ణయం సరైనదైతే ఇంతమంది పోలీసుల్ని ఎందుకు మోహరిస్తున్నారు. జాతీయ పార్టీల బాధ్యత గుర్తు చేయడనికే జనసేన పుట్టుకొచ్చింది. రైతులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా? ఒక్క రాజధానికి దిక్కులేదు.. మూడు రాజధానులు అంటున్నారు. ఆంగ్లేయులు వెళ్ళిపోయినా విభజించు పాలించు విధానం వైకాపా రక్తంలో నుంచి పోలేదు. అమరావతి రైతులకు బలంగా అండగా ఉంటాం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగితే కేసులు పెట్టండి. అది చేయకుండా రాజధాని మార్పు చేయడం ఏంటి? అక్కడ భూములు కొనుగోలు చేసి రాజధాని మార్పు అంటున్నారు. ఇక్కడి నుంచి ఉద్యోగులు అక్కడికి వెళితే ఎంత ఖర్చవుతుందో తెలుసా?  రాష్ట్రంలో పరిణామాలు ప్రజలకూ అర్థం కావడంలేదు.  వైకాపాను ఎదుర్కొనేందుకు భాజపాతో కలిశాం. వైకాపా పిచ్చితనానికి అడ్డుకట్ట వేయాలి. రాజధాని ఇక్కడ ఉండాలని నిర్ణయించాం. ఇప్పుడు మార్పు అంటే ప్రజలకు ఏం సమాధానం చెబుతాం. మహిళల కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదు.  వైకాపా వినాశనానికి ఇది పునాది. అయిదు కోట్ల మంది అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విచ్చిన్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు బలంగా నిలబడతాం. శాంతిభద్రతల్ని కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను నిస్సహాయంగా మార్చారు. పోలీసులను దాటుకుని వెళ్లొచ్చు. కానీ వారి విధులకు ఆటంకం కలిగించవద్దనే ఆగాం. రాజధాని ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇక్కడికే వస్తుంది. ఇది ఖాయం’ అని అన్నారు.

 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని