మండలి రద్దు సహేతుకం కాదు: పవన్‌
close
Published : 28/01/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మండలి రద్దు సహేతుకం కాదు: పవన్‌

అమరావతి: శాసన మండలి రద్దు సవ్యమైన చర్య కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పునరుద్ధరించిన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సరికాదని చెప్పారు. శాసన మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పవన్‌ ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందుచూపుతో రాష్ట్రాల్లో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. శాసనసభలో పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై పెద్దల సభలో మేథోపరమైన మథనం కోసమే ఉన్నతాశయంతో మండలి ఏర్పాటైందని చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాన్ని రద్దు చేయడం సబబు కాదని పవన్‌ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. శాసన మండలి రద్దుకు ప్రజామోదం ఉందా? లేదా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోతే దానిని రద్దు చేయడం సహేతుకంగా లేదన్నారు. మండలి రద్దుతో మేధావుల ఆలోచనలను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించే అవకాశాన్ని మనం కోల్పోయినట్లేనని పవన్‌ అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని