ఇక గ్యాస్‌ ధరలూ మార్కెట్‌కు లింక్‌
close
Updated : 26/06/2020 19:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇక గ్యాస్‌ ధరలూ మార్కెట్‌కు లింక్‌

దశల వారీగా ధరల నియంత్రణ వదిలేస్తామన్న ధర్మేంద్ర ప్రధాన్‌

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ మాదిరిగానే గ్యాస్‌ ధరలనూ మార్కెట్‌ శక్తులకు అనుసంధానం చేసేందుకు రంగం సిద్ధమైంది. దశలవారీగా గ్యాస్‌ ధరలపై నిర్ణయాధికారాన్ని వదిలేస్తామని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం చెప్పారు. వాటి ధరలను మార్కెట్‌కు అనుసంధానం చేస్తామని వెల్లడించారు.

దేశంలో చమురు డిమాండ్‌ 2019, జూన్‌తో పోలిస్తే 85 శాతంగా ఉందని ప్రధాన్‌ చెప్పారు. 2021 ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికానికి డిమాండ్‌ సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపారు. సెప్టెంబర్‌-అక్టోబర్‌లో జెట్‌ ఇంధనం మినహా చమురు గిరాకీ కరోనా మునుపటి స్థితికి చేరుకుంటుందని పేర్కొన్నారు.

ఇరవై రోజులుగా పెట్రోల్‌, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్‌ను మించి డీజిల్‌ ధరలు పెరగడం వాహనదారులను కలవరపెడుతోంది. ప్రస్తుతం రెండూ రూ.80/లీటర్‌కి మించే ఉన్నాయి. 2030కి దేశీయ చమురు శుద్ధీకరణ సామర్థ్యం 439 ఎంటీపీఏ, 2040కి 533 ఎంటీపీఏకు పెరుగుతుందని ప్రధాన్‌ తెలిపారు. బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని